News February 26, 2026

పీ-4 ద్వారా 65 శాతం వెరిఫికేషన్ పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో పీ-4 కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 65 శాతం బంగారు కుటుంబాల ధ్రువీకరణ పూర్తయిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. బుధవారం అమరావతి నుంచి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి పియూష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో గుర్తించిన 71,910 బంగారు కుటుంబాల్లో, ఇప్పటికే 5,554 మంది మార్గదర్శకులు 43,814 కుటుంబాలను దత్తత తీసుకున్నారని వివరించారు.

Similar News

News April 19, 2026

మెదక్: ఇంటికి చేరాలి.. షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కోసం రూపొందించిన “ఇంటికి చేరాలి…” అనే షార్ట్ ఫిల్మ్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. 99 రోజుల ప్రజా ప్రణాళిక “సురక్షిత ప్రయాణం” కార్యక్రమంలో భాగంగా రూపొందిన ఈ చిత్రం యువతలో మార్పు తీసుకురావడమే లక్ష్యంమని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, జరిమానాలు, శిక్ష కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసం అనే సందేశాన్ని అందిస్తోందని తెలిపారు.

News April 19, 2026

59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారు.. మోదీపై ఖర్గే ఫైర్

image

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ప్రసంగంలో ప్రధాని 59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారని, మహిళల గురించి మాత్రం తక్కువగా మాట్లాడారని విమర్శించారు. మోదీ ప్రాధాన్యం మహిళలు కాదని, కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అధికారిక వేదికను రాజకీయ విమర్శలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఆరోపించారు.

News April 19, 2026

ఓడినా పెరిగిన CSK ర్యాంక్.. అదెలా?

image

IPL: SRHతో మ్యాచ్‌లో ఓడినా పాయింట్ల పట్టికలో CSK ఒక మెట్టు పైకి ఎక్కడం విశేషం. మ్యాచ్‌కు ముందు -0.846 రన్ రేట్‌తో ఎనిమిదో ప్లేస్‌లో ఉన్న చెన్నై కేవలం 10 పరుగుల తేడాతోనే ఓడిపోవడంతో రన్ రేట్ -0.780కి మెరుగైంది. దీంతో లక్నోను వెనక్కి నెట్టి ఏడో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో ఎషాన్ మలింగ యార్కర్లతో కట్టడి చేయగా చివరి ఓవర్‌లో ప్రఫుల్ హింగే అద్భుతంగా బౌలింగ్ చేసి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.