News February 25, 2025
పీ-4 సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

పీ-4 సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం గ్రామంలో మంగళవారం ఆమె పర్యటించారు. గ్రామంలో పీ-4 సర్వేతో పాటు భూముల రీసర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పీ-4 సర్వేలో భాగంగా స్థానికులతో మాట్లాడి వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.
Similar News
News May 7, 2025
ఒంగోలు: మత్స్యకారులకు మెగా చెక్కును అందజేసిన కలెక్టర్

ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు.
News May 7, 2025
ఒంగోలు: మూగజీవుల పాలిట ప్రాణదాతలు పశు వైద్యులు

మూగజీవుల పాలిట ప్రాణదాతులుగా పశు వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పంపిన సందేశాన్ని వినిపించారు.
News May 7, 2025
ఒంగోలు: గనుల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ గనుల శాఖ అధికారులు, 6 ఇసుక స్టాక్ యార్డుదారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివిధ డిపోలలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంచాలని ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాపై తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.