News March 7, 2025
పీ-4 సర్వేపై ఏలూరు కలెక్టర్ సూచనలు

ఏలూరు జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి చేపట్టనున్న పీ-4 సర్వేను విజయవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో పీ-4 సర్వే, ఎంఎస్ఎంఇ సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, సచివాలయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పీ-4 సర్వే నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.
Similar News
News November 26, 2025
JN: ఎన్నికల నిబంధనలపై అందరికీ అవగాహన ఉండాలి: కలెక్టర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ సాఫీగా జరగాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఎన్నికల నియమ నిబంధనలపై సమగ్ర అవగాహన ఉండాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ నుండి కౌంటింగ్ వరకు జరిగే ప్రతి ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు.
News November 26, 2025
జగిత్యాల: యూరియా నిల్వల పర్యవేక్షణకు నోడల్ అధికారుల నియామకం

యూరియా అందుబాటు, సరఫరా, నిలువల స్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు నియోజకవర్గాల వారీగా నోడల్ అధికారులను నియమించినట్లు జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ బుధవారం తెలిపారు. కోరుట్ల నియోజకవర్గానికి రమేష్, ధర్మపురి నియోజకవర్గానికి రామచందర్, జగిత్యాల నియోజకవర్గానికి తిరుపతి నాయక్, వేములవాడ నియోజకవర్గానికి రాజుల నాయుడు, చొప్పదండి నియోజకవర్గానికి చంద్ర దీపక్ ను నియమించినట్లు పేర్కొన్నారు.
News November 26, 2025
మల్లన్నపేట జాతరలో దండివారం సందడి

గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర రెండో రోజు బుధవారం (దండివారం) భక్తుల రద్దీతో సందడిగా మారింది. వేలాది మంది భక్తులు “మల్లన్న” నాదాల మధ్య స్వామివారికి బెల్లంతో చేసిన బోనాలు సమర్పించి దర్శించుకున్నారు. గర్భగుడిలో భారీగా బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల భద్రత కోసం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


