News June 29, 2024
పుంగనూరుకు పోవడం కూడా కష్టమే: లాయర్
తన భద్రత విషయమై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డికి 5+5 భద్రత ఉండేది. ఇప్పుడు 2+2 కూడా ఇవ్వడం లేదు. భద్రత ఉపసంహరణపై పోలీసులు కారణాలు చెప్పడం లేదు. ఆయన MLAగా పుంగనూరుకు కూడా వెళ్లలేకున్నారు’ అని కోర్టులో వాదించారు. విచారణ జులై 8కి వాయిదా పడింది.
Similar News
News December 13, 2024
చిత్తూరు జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ప్రకటించారు. ప్రతి ఒక్క స్కూల్ ఈ నింబధన పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు నిన్ననే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 12, 2024
సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ
తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో సెలవుపై ఇప్పటికీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 12, 2024
మదనపల్లె: రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు శుక్రవారం సెలవు ప్రకటించామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కేవలం మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని మండలాలకు మాత్రమే వర్తిస్తుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.