News August 4, 2024

పుంగనూరు ఈవోపీఆర్డీపై వేటు

image

పుంగనూరు MPDO ఆఫీసులో రూ.1.37 కోట్ల నిధుల దుర్వినియోగం ఉదంతంలో ఈవోపీఆర్డీ నారాయణను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీపీవో లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే డేటా ఎంట్రీ ఆపరేటర్ సునీల్, ప్రస్తుత ఏవో రాజేశ్వరి, సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నారాయణపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఉన్నతాధికారులు ఆదేశించారు.

Similar News

News December 13, 2025

చిత్తూరు: ALERT.. ఈ నెల 19 లాస్ట్.!

image

ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 19వ తేదీలోపు ఆన్ లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. టెన్త్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్స్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు.

News December 13, 2025

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు

image

చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి ఎరువులు, యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 2నెలల కాలంలో జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్టు చెప్పారు. రాబోయే 21 రోజులకు 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. 2,117 టన్నులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.