News April 11, 2024
పుంగనూరు: గుండెపోటుతో వైద్య పర్యవేక్షకుడి మృతి

పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాలెంకు చెందిన ఇందు శేఖర్ (52) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. పెద్దపంజాణి పీహెచ్సీలో వైద్య పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న ఆయన
బుధవారం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఛాతినొప్పితో కింద పడిపోయారు. స్థానికులు గమనించి వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య చంద్రకళ స్థానిక మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయిని.
Similar News
News March 20, 2025
పుంగనూరు: కోర్టులో లొంగిపోయిన నిందితురాలు

పుంగనూరు మండలంలోని కృష్ణాపురంలో రామకృష్ణ హత్యకేసులో నిందితురాలైన రజిని బుధవారం న్యాయవాది శివప్పనాయుడు ద్వారా కోర్టులో లొంగిపోయింది. రికార్డులు పరిశీలించిన అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి వంశీకృష్ణ ఆమెను జుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ హత్య కేసులో నిందితులైన త్రిలోక, మహేశ్‌ను అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ చెప్పారు.
News March 20, 2025
చిత్తూరు: కురబ కులస్థుల పెద్ద జాతరకు రావాలని YS జగన్‌కు ఆహ్వానం

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం జ్యోగ్గానూరులో కురబ కులస్థుల సిద్దేశ్వర, వీరేశ్వర పెద్ద జాతరకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు జడ్పీటీసీ కృష్ణమూర్తి, మునెప్ప, రవిలు కోరారు. ఏడేళ్లకు ఒకసారి వైభవంగా పెద్ద జాతరను నిర్వహిస్తారు. బుధవారం విజయవాడలో జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. కురబ కులస్థులకు ఆయన ఈ సందర్భంగా జాతర శుభాకాంక్షలు తెలిపినట్లు వారు తెలిపారు. కులస్థుల – సిద్దేశ్వర – సందర్భంగా
News March 19, 2025
పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

చిత్తూరు నగరంలోని మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. చిత్తూరు జిల్లా అంతట పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని రకాల భద్రత చర్యలను ఏర్పాటు చేశామన్నారు.