News April 10, 2024
పుంగనూరు: పెరిగిన పూల ధరలు

పండగలు నేపథ్యంలో పూల ధరలు పెరిగాయి. జిల్లాలో సాగయ్యే కనకాంబరాలు పూలు తక్కువగా రావడం, డిమాండు అధికంగా ఉండటంతో కిలో రూ.1000 ధర పలికింది. ఇక, బంతిపూల మాల రూ.200 నుంచి రూ.250 వరకు పలికాయి. కిలో బంతులు ఒకటో రకం రూ.120- నుంచి రూ. 100 ధరతో లభిస్తున్నాయి. మల్లెపూలు రకాలను బట్టి రూ. 400 నుంచి 700 వరకు ఉన్నాయి. పండుగల నేపథ్యంతో పాటు పూల సాగు తగ్గడంతో ధరల పెరుగుదల ఉన్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Similar News
News October 22, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..!

చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 28 మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయపురంలో 20.2 మిమీ, అత్యల్పంగా యాదమరిలో 1.8 మిమీ వర్షపాతం నమోదైంది. గుడిపాలలో 14.2, ఐరాలలో 13.2, పూతలపట్టులో 9.4, పెద్దపంజాణిలో 9.2, పాలసముద్రంలో 8.6, పులిచెర్లలో 7.6, గంగాధరనెల్లూరులో 8.2, పలమనేరు, సోమల మండలాల్లో 6.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
News October 22, 2025
చిత్తూరు CDCMS పర్సన్ ఇన్ఛార్జ్ జేసీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(CDCMS)కి అఫిషియల్ పర్సన్ ఇన్ఛార్జ్గా జాయింట్ కలెక్టర్ విద్యాధరిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీ వరకు లేదా తిరిగి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. గతంలో నియమించిన సుబ్రహ్మణ్యం నాయుడు మృతిచెందిన సంగతి తెలిసిందే.
News October 22, 2025
చిత్తూరు జిల్లాకు ఆరంజ్ అలర్ట్

చిత్తూరు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జిల్లా అంతట మంగళవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటలు నీట మునిగి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలకు సైతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.