News October 30, 2024

పుంగనూరు: బాలికపై అత్యాచారం..

image

బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను చౌడేపల్లె మండలం పి.బయప్పల్లెకు చెందిన చరణ్ (23), పుంగనూరు మండలం గూడూరుపల్లెకు చెందిన బి.భార్గవ్ సహకారంతో తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సీఐ తెలిపారు. బాలికను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Similar News

News November 12, 2024

చిత్తూరు: 14 నుంచి ఇంటి వద్దనే క్యాన్సర్ పరీక్షలు

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 14 నుంచి ఇంటి వద్దనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ బీపీ, షుగర్, గుండె, థైరాయిడ్, పెరాలసిస్, క్యాన్సర్ వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముందుగానే వ్యాధులు గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరం అవుతుందన్నారు.

News November 11, 2024

చిత్తూరు: 14 నుంచి ఇంటి వద్దనే పరీక్షలు

తిరుపతి: సైబర్ నేరాల పట్ల DGP అవగాహన

image

సైబర్ క్రైమ్, డ్రగ్స్, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ ద్వారకా తిరుమలరావు సోమవారం అవగాహన కల్పించారు. ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని సుమారు 900 పాఠశాలలు, 60 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను DGP వివరించారు. మహిళా దాడులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని చెప్పారు.