News March 17, 2025
పుకార్లకు చెక్ పెట్టేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు

తాండూరు మండలంలో పులి పిల్ల సంచరిస్తున్నట్లు వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకు స్థానిక అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత రెండు రోజుల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని సిమెంట్ కర్మాగారం సమీపంలో పులిపిల్ల కనిపించినట్లు కార్మికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News October 17, 2025
రైతులకు యూనిక్ నంబర్లు తప్పనిసరి: సత్యవతి

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథక లబ్ధి చేకూరాలంటే యూనిక్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ సత్యవతి తెలిపారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇనాక్టివ్, రిజెక్ట్ అయిన రైతుల వివరాలను సంబంధిత హోం పేజీలో పొందుపరిచి సరిచేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
News October 17, 2025
సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో అలా లేదు: ఈసీ

TG: స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. ‘ఎన్నికలకు వెళ్లాలని SC కూడా చెప్పింది కదా?’ అని ECని HC ప్రశ్నించింది. అయితే విచారణ సందర్భంగా అలా వ్యాఖ్యానించింది కానీ ఫైనల్ ఆర్డర్ కాపీలో ఎన్నికలకు వెళ్లాలనే ఆదేశాలు లేవని EC పేర్కొంది. రిజర్వేషన్ల అంశం కోర్టులో పెండింగ్లో ఉన్నందున అది తేలేవరకు ఎలక్షన్స్ నిర్వహించలేమంది. ప్రభుత్వంతో చర్చించాకే రీనోటిఫికేషన్ ఇస్తామని HCకి వివరించింది.
News October 17, 2025
ఇలా అయితే.. సిటీ మూసీలోకే: రఘునందన్రావు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంపీ రఘునందన్రావు హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని పేర్కొన్నారు. కన్నీళ్లతో ఒకరు ప్రచారానికి వస్తే.. కట్టెలు తీసుకొని ఇంకొకరు వస్తున్నారన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు వచ్చినా సిటీ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.