News February 2, 2025
పుచ్చలపల్లి ఊరిలో CPM అగ్ర నేత పర్యటన

కమ్యూనిస్టు పోరాట యోధుల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య స్వగ్రామం విడవలూరు(M) అలగానిపాడులో CPM పొలిట్ బ్యూరో సభ్యులు బేబీ పర్యటించారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య నివాసంలో ఉన్న ఆనాటి పుస్తకాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. తాను నెల్లూరులో జరుగుతున్న మహాసభలకు వచ్చానని, సుందరయ్య స్వగ్రామం చూడాలన్న కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News October 31, 2025
నెల్లూరు మెడికల్ కాలేజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డిప్లొమా కోర్సులో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. లోకల్ 85%, నాన్ లోకల్ అభ్యర్థులకు 15% సీట్లు కేటాయిస్తామని కాలేజీ ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు. అభ్యర్థులు రూ.100 చెల్లించి అప్లికేషన్లు తీసుకోవాలని.. నవంబర్ 7వ తేదీ లోపు కాలేజీలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు spsnellore.ap.gov.in/notice/ వెబ్సైట్ చూడాలన్నారు.
News October 30, 2025
సోమశిలకు పెరుగుతున్న వరద

సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 4 నుంచి 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 77,650 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి 78,460 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే మొత్తంలో కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 72 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. వరద పెరుగుతుండటంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.
News October 30, 2025
నెల్లూరు జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాసులు

నెల్లూరు జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాసులు గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ఖజానా విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఖజానా సిబ్బంది అందరి సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


