News April 25, 2024

పుట్టపర్తిలోకి రాకుండా వాహనాలతో అడ్డగింపు

image

 జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాకుండా పోలీసులు వాహనాలతో అడ్డుకున్నారు. సత్యసాయి బాబా ఆరాధన సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో నారాయణ సేవ జరగుతుంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి నామినేషన్ వేస్తుండగా వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పుట్టపర్తి పట్టణంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా రాకుండా పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టారు.

Similar News

News February 24, 2026

తాడిపత్రిలో కారు బీభత్సం.. 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్ ఇంజిన్

image

తాడిపత్రి మండలంలో కారు బీభత్సం సృష్టించింది. రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ భాగాలు రెండుగా విడిపోయాయి. కారుకు సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 24, 2026

జిల్లాలో వేగవంతంగా శనగల కొనుగోలు ప్రక్రియ

image

జిల్లాలో శనగల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ (DLPC) సమావేశం జరిగింది. క్వింటా శనగ రూ.5,875 మద్దతు ధరను నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా పంట సేకరణ కోసం ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలను ఖరారు చేశామన్నారు.

News February 24, 2026

ఇంటర్ పరీక్షలకు 359 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 64 పరీక్ష కేంద్రాలలో జరిగినట్లు ఆర్ఐవో రమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,919లో 20,588 మంది హాజరు కాగా 331 మంది గైర్హాజర్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,900 గాను 1,872 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను సిసి కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామని ఆయన తెలిపారు.