News February 4, 2025
పుట్టపర్తిలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభ మందిరం వెలుపల చైనా దేశస్థులతో పాటు శ్రీ సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, భక్తులు వేడుకలలో పాల్గొన్నారు. చైనాకు చెందిన దాదాపు 400 మంది భక్తులు పుట్టపర్తికి వచ్చి వారి దేశ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
Similar News
News December 4, 2025
KMM: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

స్థానిక ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఏకంగా సొంత అక్కాచెల్లెళ్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో చిట్టూరి రంగమ్మ, స్వతంత్ర అభ్యర్థిగా మల్లెంపుడి కృష్ణకుమారి బరిలో ఉన్నారు. వీరిద్దరూ కలిసిమెలిసి ఉన్నవారే కావడంతోపాటు కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. కాగా ఈ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందోనని మండలంలో చర్చ జరుగుతోంది.
News December 4, 2025
పాలమూరు: సర్పంచ్ పదవికి MBBS విద్యార్థిని నిఖిత పోటీ

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి వైద్య విద్యార్థిని కే.ఎన్. నిఖిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను నామినేషన్ వేశానని.. గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కాగా ఆమె నామినేషన్ వేయడంతో గ్రామంలోని యువత సైతం అభినందిస్తున్నారు.
News December 4, 2025
అదనపు సిబ్బందిని తీసుకోండి.. SIRపై సుప్రీంకోర్టు

‘SIR’ విధుల్లో ఒత్తిడితో BLOల <<18435836>>ఆత్మహత్య<<>> ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బందులు వచ్చినప్పుడు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పని గంటలనూ తగ్గించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ECతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అయితే సరైన కారణంతో విధుల నుంచి మినహాయింపు కోరితే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.


