News February 4, 2025

పుట్టపర్తిలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్‌ సభ మందిరం వెలుపల చైనా దేశస్థులతో పాటు శ్రీ సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, భక్తులు వేడుకలలో పాల్గొన్నారు. చైనాకు చెందిన దాదాపు 400 మంది భక్తులు పుట్టపర్తికి వచ్చి వారి దేశ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

Similar News

News February 18, 2026

ఖమ్మం: వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి

image

ఖమ్మం (D)లో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇకపై రాత్రి వేళల్లో వాహనాలు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ కొత్త రూల్ తెచ్చింది. క్యూఆర్ కోడ్ లేని వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేయమని RTO జగదీష్ స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో నిలిపి ఉంచిన లారీల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు.

News February 18, 2026

మంచిర్యాల: ప్రేమ.. పెళ్లి.. హత్య

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న <<19163523>>భర్తను <<>>ఓ భార్య హత్య చేసింది. ఎస్సై వివరాల ప్రకారం.. మందమర్రిలోని శాంతినగర్‌లో మోయిన్(42), అవంతి కులాంతర వివాహం చేసుకున్నారు. విహహేతర సంబంధం పెట్టుకుందని అతడు తరచూ ఆమెను వేధించేవాడు. సహనం కోల్పోయిన అవంతి మంగళవారం తెల్లవారుజామున కత్తితో పొడిచింది. మోయిన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News February 18, 2026

పునుగు పిల్లి తైలంతో శ్రీవారికి శాంతి.!

image

పునుగు తైలం లేకుంటే శ్రీవారి <<19172050>>అభిషేకం<<>> పరిపూర్ణం కాదని పండితులు చెబుతున్నారు. ఈ తైలంతో అభిషేకం చేస్తే శ్రీవారు శాంతిస్తారని, మన తప్పుల్ని మన్నిస్తారని నమ్మకం. పునుగు తైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది. ఓ గదిలో పునుగు పిల్లిని ఉంచుతారు. ఇనుప జల్లెడ గదిపై భాగంలో రంధ్రం చేసి ఎర్ర చందనం కర్రను నిలబెడతారు. ఈ పిల్లి ప్రతీ 10 రోజులకు ఒకసారి చందనపు కర్రకు చర్మాన్ని రుద్దుతుంది. ఆ సమయంలో తైలం లభిస్తుంది.