News July 13, 2024
పుట్టపర్తిలో జాతీయ యువజన సదస్సుకు 26 దేశాల ప్రతినిధులు

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన జాతీయా యువజన సదస్సుకు 26 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రశాంతి నిలయంలో 3 రోజుల పాటు జరిగే సదస్సుకు దాదాపు 2500మంది ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే ఏడాది సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం ప్రారంభమైన సదస్సు ద్వారా భక్తులకు పలు సూచనలు ఇవ్వనున్నారు.
Similar News
News November 1, 2025
ఒకే ఇంట్లో ఆరుగురికి పింఛన్.. ₹36వేలు అందజేత

అనంతపురంలోని 26వ డివిజన్ హమాలీ కాలనీలో ఒకే ఇంట్లో ఆరుగురు దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. సయ్యద్ కుటుంబంలోని ఆరుగురు (సయ్యద్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, మనుమడు) మూగవారు కావడంతో, వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున పింఛను మంజూరు చేస్తోంది. శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారందరికీ పింఛన్లను అందజేశారు. రూ.36వేలు అందించారు.
News November 1, 2025
ఖాళీల భర్తీలు పక్కా ఉండాలి: అనంత కలెక్టర్

ఐసీడీఎస్లో ఖాళీల భర్తీకి నిబంధనల ఉల్లంఘనకు తావులేదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 36 వర్కర్లు, 68 హెల్పర్లు కలిపి మొత్తం 104 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News October 31, 2025
పోలీసు అమరవీరులకు జోహార్లు

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జిల్లా ఎస్పీ జగదీశ్ జోహార్లు తెలిపారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల ముగింపు రోజున శుక్రవారం అనంతపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ జగదీష్, ఇతర పోలీస్ అధికారులు అమర వీరులకు నివాళులర్పించారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు, వ్యాస రచన పోటీలు, ఉచిత వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు SP తెలిపారు.


