News March 29, 2025

పుట్టపర్తిలో సినీ నటుడు సాయికుమార్ సందడి

image

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శుక్రవారం సినీ నటుడు సాయికుమార్ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్. జె. రత్నాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి సమాధి దర్శనార్థం పుట్టపర్తికి వచ్చినట్లు తెలిపారు. మానవాళికి ఉచిత విద్య, వైద్యంతో పాటు తాగునీరు అందిస్తున్న ఘనత సత్యసాయి ట్రస్ట్‌కే దక్కుతుందన్నారు. మనమందరం సత్యసాయి బాటలో ప్రజలకు సేవలు చేయాలన్నారు.

Similar News

News December 3, 2025

సిరిసిల్ల: రెండో దశ.. పంచాయతీలకు 603 నామినేషన్లు

image

జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల కోసం 603 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 88 పంచాయతీలకు గాను చివరిరోజు మంగళవారం 292 నామినేషన్లు స్వీకరించగా మొత్తం నామినేషన్ల సంఖ్య 603కు చేరిందని అధికారులు తెలిపారు. 758 వార్డులకు గాను మంగళవారం 1,119 నామినేషన్లు రాగా మొత్తం 1,811 నామినేషన్లు అందినట్లు వివరించారు. నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించనున్నారు.

News December 3, 2025

శ్రీకాకుళం: కొండెక్కిన టమాటాల ధర

image

శ్రీకాకుళం మార్కెట్లో టమాటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో 70 రూపాయలు పలుకుతోంది అక్టోబర్, నవంబర్ నెలలలో కిలో టమాటాల ధర సగటున రూ.30 నుంచి రూ.50కు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటికీ 70 రూపాయలుగా ఉందని, ఇది ₹100 దాటవచ్చని అంటున్నారు. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు అయ్యప్ప దీక్షల కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగిందంటున్నారు. మీ ఏరియాలో ధర ఎంతో కామెంట్ చేయండి.

News December 3, 2025

ధోనీ రూమ్‌లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

image

క్రికెట్‌ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్‌ఫీల్డ్‌లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్‌లో ధోనీ రూమ్‌ అనధికారిక టీమ్ లాంజ్‌లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్‌ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.