News March 16, 2026

పుట్టపర్తి కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు జయంతి

image

పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, పలువురు అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ కొనియాడారు. ఆయన నిస్వార్థ సేవలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 13, 2026

రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రేపు మార్కెట్‌లో అన్ని రకాల క్రయవిక్రయాలు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని, రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మార్కెట్ పాలకవర్గం ఒక ప్రకటనలో కోరింది.

నాగార్జునసాగర్ డ్యాం స్పిల్‌వే పరిశీలన

image

నాగార్జునసాగర్ డ్యాం స్పిల్‌వేను కేంద్ర డ్యాం సేఫ్టీ బృందం ఛైర్మన్ శర్మ ఆధ్వర్యంలో పరిశీలించింది. స్పిల్‌వేపై ఏర్పడిన గుంతలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బకెట్ పోర్షన్‌లో నీరు ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ, ప్రాజెక్టు రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేశారు. ఈ పర్యటనలో సత్యనారాజ్, గౌతమ్ పాల్గొన్నారు.