News August 11, 2025
పుట్టపర్తి కలెక్టరేట్‌లో 226 ప్రజా అర్జీల స్వీకరణ

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ టీఎస్ చేతన్ 226 అర్జీలు స్వీకరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శక విచారణ చేపట్టాలని సూచించారు. నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పుట్టపర్తి-89, పెనుకొండ-59, ధర్మవరం-55, కదిరి నియోజకవర్గం నుంచి 23 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 10, 2026
పశువులకు సరైన సమయంలో టీకాలు ఇవ్వాలి: కలెక్టర్

పశువులకు సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ టీకాలు అందించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మాచారెడ్డిలో పశువుల ఆరోగ్య సంరక్షణకు 8వ విడత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పశువులకు ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రతి గ్రామంలో టీకాలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి దేవేందర్, తదితరులున్నారు.
News March 10, 2026
తిర్యాణి: అడవి సంపద రక్షణకు.. సిలిండర్ మార్గమా..?

జాతీయ అడవి, వన్య ప్రాణి పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో అడవి సంపదను రక్షించేందుకు ఆ శాఖ అధికారులు అనేక రకాలుగా చర్యలు చేపడుతున్నారు. అయితే అవి అడవి సంపదను కాపాడుతాయా అనే ప్రశ్న కూడా మొదలైంది. ఏటా కొన్ని వేల టన్నుల వంట చెరుకు కాలుస్తున్నారని.. గిరిజనులు అడవికి వెళ్లకుండా సిలిండర్ ఉపాయాన్ని అధికారులు ముందట వేసుకున్నారు. అయితే ఇలా ఎన్ని రోజులు అందిస్తారో తెలియాల్సి ఉంది.
News March 10, 2026
ANU: ప్రవేశ పరీక్షా షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ఉమ్మడి ప్రవేశ పరీక్షా షెడ్యూల్‌ను మంగళవారం కో ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ విడుదల చేశారు. ఈ నెల 15న రాష్ట్రంలోని 12 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ www.anucde.info నుంచి హాల్ టికెట్లను పొందవచ్చన్నారు.


