News November 4, 2024
పుట్టపర్తి కలెక్టరేట్‌లో కత్తి కలకలం
పుట్టపర్తి కలెక్టరేట్‌లో కత్తి కలకలం రేపింది. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తనకల్లు మం. బొంతలపల్లి గ్రామానికి చెందిన ప్రేమలత అనే మహిళ కత్తితో రావడం సంచలనమైంది. పోలీసులు విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహించగా కత్తి బయటపడింది. మహిళను విచారించగా తాను ఒంటరి మహిళనని, ఆత్మరక్షణ కోసం కత్తి తెచ్చుకున్నానని చెప్పినట్లు సమాచారం. పోలీసులు కత్తి స్వాధీనం చేసుకుని ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Similar News
News December 2, 2024
అనంతపురం జిల్లాలో 11,862 మంది HIV రోగులు
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ‘ఏపీ సాక్స్’ తెలిపింది. ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది ఉండగా అనంతపురం జిల్లాలో 11,862, శ్రీ సత్యసాయి జిల్లాలో 11,089 మంది HIV రోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఏటా రాష్ట్రంలో 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు తెలిపింది. 2023లో అనంతపురం జిల్లాలో 235 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 231 మంది HIV బారినపడ్డారు.
News December 2, 2024
సీఎం చంద్రబాబు గొప్ప మనసు.. కళ్యాణదుర్గం చిన్నారికి అండ!
కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన లిఖిత అనే చిన్నారికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్న విషయాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నేమకల్లు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రూ.10 లక్షల నిధులను మంజూరు చేశారు. బాధితులు సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 2, 2024
ATP: ‘పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలి’
అనంతపురం పట్టణంలోని సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తున్నామని ఆదివారం కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 9.గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని ప్రజలు నుంచి ఆర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు.