News October 18, 2024

పుట్టపర్తి: కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన జేసీ

image

కేంద్ర మంత్రి మురుగన్ శుక్రవారం పుట్టపర్తిలోని సత్యసాయి బాబా సమాధి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథి గృహం వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం బాబా సమాధిని దర్శించుకున్నారు. వారితో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

Similar News

News November 2, 2024

పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూ సేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ఎన్‌హెచ్ 342, 716జీ, జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ బెంగళూరు- కడప- విజయవాడకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులకు సేకరించిన భూమి వివరాలను తెలుసుకున్నారు.

News November 1, 2024

ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

image

శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలం కొండకమర్లలో మెహెతాజ్ (36) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. ఆమెకు కొంతకాలంగా ఇర్ఫాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ మరో వ్యక్తితో కూడా చనువుగా ఉందని అనుమానించిన ఇర్ఫాన్ రాత్రి ఆమెను హత్య చేశాడు. తానే చంపినట్లు శుక్రవారం పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చి లొంగిపోయాడు. ఓబులదేవరచెరువు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News November 1, 2024

వెపన్ మిస్ ఫైర్‌తో గాయపడ్డ అనంతపురం ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌?

image

అనంతపురం జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురయ్యారు. అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్‌లో గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వెపన్ క్లీన్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయింది. ఘటనలో ఆయన గాయపడ్డారు. సిబ్బంది వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.