News September 3, 2024
పుట్టపర్తి: జ్వరంతో బాలుడి మృతి
పుట్టపర్తిలోని 2వ వార్డులో దేవ అనే బాలుడు జ్వరంతో మరణించినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. బాలుడుకి ఆదివారం నుంచి జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా అక్కడ నయం కాకపోవడంతో సత్యసాయి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అనంతపురం సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. వారు అనంతపురం తీసుకెళ్లాగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 12, 2024
బీటెక్, MBA, MCA, M.SC ఫలితాల విడుదల
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని బీటెక్ సప్లిమెంటరీ (R15, R19), MBA (R17, R21), MCA (R20, R21), M.SC (R20, R21) ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News September 12, 2024
విజయవాడ వరద బాధితుల కష్టాలకు చంద్రబాబే కారణం: కేతిరెడ్డి
విజయవాడలో వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడడానికి కారణం సీఎం చంద్రబాబే అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుడమేరు కాలువకు అధిక మొత్తంలో వరద రాబోతోందని అధికారులు తెలిపినా పట్టించుకోలేదని అన్నారు. అందుకే వరద ధాటికి లోతట్టు ప్రాంతాలు మునిగాయన్నారు.
News September 12, 2024
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పుట్లూరు మండలం గాండ్లపాడులో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిని పావని(19) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పావని కోయంబత్తూర్‌లో బీటెక్ సెకండియర్ చదువుతోంది. వినాయక పండగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.