News April 6, 2024
పుట్టపర్తి : నేటి నుంచి సమ్మెటివ్-2 పరీక్షలు

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో సమ్మెటివ్-2 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ మీనాక్షి తెలిపారు. 1 నుంచి 9వ తరగతులకు – ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. 6 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీఈఓ ఆదేశించారు.
Similar News
News February 24, 2026
అనంతపురం జిల్లాలో మొదలైన ఇంటర్ సెకండియర్ పరీక్షలు

అనంతపురం జిల్లాలోని 64 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నోటీసు బోర్డుల వద్ద ఏర్పాటు చేసిన రోల్ నంబర్ల షీట్లను సరిచూసుకుని లోపలికి వెళ్లారు. అధికారులు నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
News February 23, 2026
ఉపాధి హామీ బిల్లుల అప్లోడ్‌పై కలెక్టర్ కఠిన ఆదేశాలు

ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ ఎక్స్పెండేచర్ బిల్లులను ప్రత్యేక దృష్టితో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులకు ఆదేశించారు. నమోదు చేయాల్సిన రూ.131 కోట్లలో ఇప్పటివరకు రూ.86.87 కోట్లు మాత్రమే నమోదు అయ్యాయని, మిగిలిన రూ.44.48 కోట్ల బిల్లులను మార్చి 10 లోపు పూర్తి చేయాలన్నారు. ఏ బిల్లు 24 గంటలకు మించి పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. సంబంధిత శాఖలు లక్ష్యాలు సాధించాలన్నారు.
News February 23, 2026
సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ఆనంద్

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. నగరంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫర్ గర్ల్స్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, మెడికల్ క్యాంపు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ వెల్లడించారు.


