News February 14, 2026
పుట్టపర్తి: రూ.19.60 లక్షల వేతనంతో ఉద్యోగం

పుట్టపర్తి(M) వెంగళమ్మ చెరువుకు చెందిన షేక్ కరిష్మా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. ఆస్ట్రేలియాకు చెందిన రైజ్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్‌లో ఆమె ఎంపికైనట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థిని ప్రతిభను గుర్తించిన సంస్థ రూ.19.60 లక్షల వేతనంతో ఉద్యోగావకాశం కల్పించినట్లు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన కరిష్మా కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించిందన్నారు.
Similar News
News March 9, 2026
గంభీర్.. ఒక్క ఫైనల్‌లోనూ ఓడలేదు

గౌతమ్ గంభీర్ ఇప్పటివరకూ ఒక్క ICC ఫైనల్ కూడా ఓడలేదు. భారత ప్లేయర్‌గా 2007 T20 WC, 2011 ODI WC, హెడ్ కోచ్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ(2025), టీ20 WC(2026) సాధించారు. ప్లేయర్‌గా 2010 ఆసియా కప్ కూడా గెలిచారు. అలాగే IPLలో KKRకి కెప్టెన్‌గా 2, మెంటార్‌గా ఒక టైటిల్ అందించారు. కోచ్‌గా జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేస్తున్నారని ఆయనపై విమర్శలొచ్చాయి. కానీ ఆ మార్పులే ఇప్పుడు విజయాన్ని కట్టబెట్టాయి.
News March 9, 2026
పాసర్లపూడిలో దారుణం.. డ్రైన్‌లో శిశువు మృతదేహం PHOTO

మామిడికుదురు మండలం పాసర్లపూడి బొమ్మిడిపాలెం వాడబోది డ్రైన్‌లో వారం రోజుల మగ శిశువు మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఎస్ఐ చైతన్య కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని రాజోలు ఆసుపత్రికి తరలించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన వారు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసికందు మరణంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 9, 2026
పోలీస్ శాఖ PGRSను సద్వినియోగం చేసుకోండి : ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేడు ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. ఉదయం10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని ఎస్పీ కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు వివరించారు.


