News February 14, 2026
పుట్టపర్తి: రూ.19.60 లక్షల వేతనంతో ఉద్యోగం

పుట్టపర్తి(M) వెంగళమ్మ చెరువుకు చెందిన షేక్ కరిష్మా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. ఆస్ట్రేలియాకు చెందిన రైజ్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్‌లో ఆమె ఎంపికైనట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థిని ప్రతిభను గుర్తించిన సంస్థ రూ.19.60 లక్షల వేతనంతో ఉద్యోగావకాశం కల్పించినట్లు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన కరిష్మా కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించిందన్నారు.
Similar News
News March 10, 2026
యుద్ధం సెగ.. పాక్ కఠిన నిర్ణయాలు

ఇరాన్ యుద్ధం సెగ పాక్‌కు గట్టిగానే తగులుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోత విధించింది. 60% వాహనాలను నడపొద్దని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత పెట్టింది. ఆఫీసులను వారానికి 4 రోజులు మాత్రమే తెరవనుంది. స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని సూచించింది.
News March 10, 2026
వాడిన నూనె వాడితే క్యాన్సర్ ముప్పు: రామయ్య

అమలాపురం హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను తిరిగి వాడటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని ఆహార భద్రతా అధికారి రామయ్య హెచ్చరించారు. సోమవారం యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూనెను పదేపదే వేడి చేయడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన నూనెను నిల్వ చేయరాదని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
News March 9, 2026
నెల్లూరులో విషాదం.. బాలుడి అక్కడికక్కడే మృతి

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాలుడు బైక్‌ని తీసుకుని స్నేహితుని కలిసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్‌లోని కలివెలపాలెం గ్రామానికి చెందిన వివాన్ (16) ఇంట్లో ఎవరు లేకపోవడంతో బైక్‌ని తీసుకొని నెల్లూరు వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొని తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


