News March 20, 2025
పుట్టపర్తి: ‘సకాలంలో రీసర్వే పూర్తి చేయాలి’

జిల్లాలో ఏపీ రీసర్వే ప్రాజెక్టు కింద జరుగుతున్న రీసర్వే పనులను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్. చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని PGRS సమావేశ మందిరంలో జేసీ అభిషేక్, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డితో పలువురు కలిశారు. వారిలో ఆర్డీవోలు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, జిల్లాలోని తహశీల్దార్లు, ఆర్ఎస్డీటీలు, మండల సర్వేయర్లు ఉండగా వారికి అవగాహన నిర్వహించారు.
Similar News
News October 14, 2025
చేగుంట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు స్వాతి

చేగుంట మండల పరిధిలోని చందాయపెట్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కే. స్వాతి రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్ 14 పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ శంకర్ చారి తెలిపారు. స్వాతి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయుడు శ్రీ కిషన్, ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల, విద్యార్థులు ఆమెను సత్కరించారు.
News October 14, 2025
ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 42 శాతం ప్రవేశాలు’

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.
News October 14, 2025
సంగారెడ్డి: NMMSకు నేడే చివరి తేదీ

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగుస్తుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.