News November 13, 2024

పుట్టపర్తి: సత్యసాయి జయంతి వేడుకలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

image

పుట్టపర్తిలో ఈనెల 23 న జరగనున్న భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి వేడుకలకు సీఎం నారా చంద్రబాబునాయుడును ట్రస్ట్ సభ్యలు ఆహ్వానించారు. ఈ మేరకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు. తప్పకుండా ఉత్సవాలకు హాజరు కావాలని సీఎంను కోరారు. 

Similar News

News December 8, 2024

అనంతపురం పోలీసుల కస్టడీలో బోరుగడ్డ

image

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఓ కేసు విచారణలో భాగంగా నిన్న అనంతపురం పోలీసులు ఆయనను మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా అక్టోబర్ 17న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

News December 8, 2024

ఆత్మకూరులో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్..కారణమిదే

image

ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నరేశ్ శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతను అప్పుల ఒత్తిడి అధికమై చనిపోయినట్లు తెలుస్తోంది. రూ. లక్షలలో అప్పుచేసి తండ్రి కొద్ది కాలం కిందట మృతిచెందగా.. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరింత కుమిలిపోయిన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News December 8, 2024

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష

image

వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష విధించినట్టు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ముదిగుబ్బ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన చెన్నకేశవరెడ్డి కుమార్తె స్రవంతిని కొత్తచెరువుకు చెందిన ఓం ప్రకాశ్ రెడ్డికి ఇచ్చి 2015లో వివాహం చేశారు. అయితే అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు ఆమెపై హత్యాయత్నం చేశారు. ఈ కేసులో ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధించారని ఎస్పీ తెలిపారు.