News May 22, 2024
పుట్టపర్తి: 24 నుంచి టెన్త్ సప్లిమెంటరీ

పుట్టపర్తిలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. 29 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 7344మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకే పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు 9గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ మీనాక్షి సూచించారు.
Similar News
News November 19, 2025
ఫార్మా-డీ ఫలితాలు విడుదల

అనంతపురం JNTU పరిధిలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నిర్వహించిన ఫార్మా-డీ 1, 5 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.

News November 17, 2025
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.