News March 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News March 15, 2025
ప్రముఖ నటుడు మృతి.. పాడె మోసిన స్టార్ హీరో

బాలీవుడ్ నటుడు, ఫిల్మ్ మేకర్ దేబ్ ముఖర్జీ(83) అనారోగ్యంతో <<15756854>>కన్నుమూసిన<<>> విషయం తెలిసిందే. నిన్న ముంబైలో జరిగిన ఆయన అంత్యక్రియలకు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్టార్ హీరో రణ్బీర్ కపూర్ దేబ్ ముఖర్జీ పాడె మోశారు. ముఖర్జీ కుమారుడు-డైరెక్టర్ అయాన్, రణ్బీర్ క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో తండ్రిని కోల్పోయిన అయాన్ను ఓదార్చి, దగ్గరుండి అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు.
News March 15, 2025
తగ్గిన బంగారం ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాదులో 24K గోల్డ్ 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.89,670 వద్ద కొనసాగుతోంది. ఇక 22K 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.82,200 వద్దకు చేరుకుంది. వెండి కిలో రూ.1,12,000 వద్ద యథాతథంగా ట్రేడవుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.27,780 వద్ద ఉంది.
News March 15, 2025
రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

TG: అసెంబ్లీలో రైతు రుణమాఫీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సగం మందికి కూడా మాఫీ జరగలేదన్నారు. దీంతో రైతుల వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ జిల్లాల వారీగా ఎన్నికోట్ల మాఫీ జరిగిందో భట్టి చదివి వినిపించారు.