News August 27, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 1, 2025

పదేళ్లలో రెట్టింపైన విదేశీ అప్పు: లోక్‌సభ

image

మన దేశ అప్పు ఊహించని విధంగా పెరుగుతూ పోతోంది. గత పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ, అప్పులపై లోక్‌సభలో వెల్లడించిన లెక్కలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. RBI ప్రకారం భారత విదేశీ రుణం దాదాపు రెట్టింపు అయ్యింది. 2015లో దేశ విదేశీ అప్పు రూ. 29,71,542 కోట్లుగా ఉంటే, 2025 జూన్ నాటికి అది రూ. 63,94,246 కోట్లకు చేరింది. అప్పులు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యుడి జీవన వ్యయం భారమవనుంది.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.