News April 16, 2025
పుట్టిన దగ్గర నుంచి ఆరేళ్ల పిల్లలందరికీ కంటి పరీక్షలు: డీఎంహెచ్‌వో

వైద్యశాఖ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వేషన్స్ సెంటర్ కార్యక్రమాలపై వైద్యశాఖ అధికారి రవి రాథోడ్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. పుట్టిన దగ్గర నుంచి ఆరేళ్ల పిల్లలందరికీ, అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలందరికీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎర్లీ ఇంటర్వేషన్స్ సెంటర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో రిఫర్ చేసిన కేసులను ఈ సెంటర్లో ఫిజియోథెరపీ చేయడం జరుగుతుందన్నారు.
Similar News
News November 28, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్‌పై రేప్ కేసు నమోదు

కేరళ పాలక్కాడ్ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్‌కూటత్తిల్‌పై అత్యాచార కేసు నమోదైంది. ఆయన తనను రేప్ చేసి గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకోవాలని బెదిరించాడని ఓ యువతి CM విజయన్‌కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరి మధ్య ఆడియో రికార్డులు, చాటింగ్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, చట్టపరంగా కేసును ఎదుర్కొంటానని MLA చెప్పారు. కాగా రాహుల్ ప్రాథమిక సభ్యత్వాన్ని INC రద్దు చేసింది.
News November 28, 2025
HYD: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన సామన్లు సర్దుకున్నట్లు టాక్. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.
News November 28, 2025
పెద్దపల్లి: మొదటి రోజు 76 నామినేషన్లు

జిల్లాలో మొదటి విడతలో కాల్వ శ్రీరాంపూర్, కమాన్పూర్, మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 99 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా మొదటి రోజు గురువారం 76 నామినేషన్ దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. జిల్లాలో 896 వార్డులకు 37 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. కులం, నివాసం సర్టిఫికెట్లు లేని పక్షంలో కనీసం మీసేవలో దరఖాస్తు చేసిన రశీదులను జోడించాలన్నారు.


