News August 28, 2024
పుట్టిన రోజు నాడే విద్యార్థి మృతి

ఉరవకొండలో తీవ్ర విషాదం నెలకొంది. పుట్టిన రోజు నాడే జ్వరంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. పట్టణంలోని 1వ వార్డుకు చెందిన హోంగార్డ్ బాబా ఫక్రుద్దీన్ కుమారుడు అజీమ్ షేక్(14) తీవ్ర జ్వరంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం మృతిచెందాడు. పుట్టిన రోజు నాడే మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News April 10, 2026
రాయలసీమ అభివృద్ధికి జగన్ ఆటంకం: ఎంపీ

రాయలసీమకు అసలైన ద్రోహి జగన్ రెడ్డేనని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వంలో 102 ప్రాజెక్టులను రద్దు చేసి, నేడు రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సీమ ప్రాజెక్టుల కోసం రూ.10,014 కోట్లు కేటాయించి, చరిత్ర సృష్టించిందన్నారు. 80శాతం ప్రాజెక్టులు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే నిర్మించినవని గుర్తుచేశారు.
News April 10, 2026
వైశాలి ఘోర్పడేకు ‘బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డు

అనంతపురం జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ వైశాలి ఘోర్పడే ‘బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డును అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం టెక్కలిలో జరిగే ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో ఈమెకు కాంక్రీట్ మీద చేసిన పరిశోధనలకు గాను పలు పేటెంట్లు కూడా దక్కాయి. ఇప్పటి వరకు 100కు పైగా అంతర్జాతీయ పత్రికలను, 4 పుస్తకాలను ప్రచురణ చేశారు.
News April 10, 2026
అనంత: ఉద్యోగాలకు JNTU విద్యార్థుల ఎంపిక

అనంతపురం JNTU విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన నియామకాల్లో 12 మంది ఎంపికయ్యారు. ఇందులో 8 మందికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం, ముగ్గురికి రూ.6.5 లక్షల వార్షిక వేతనం, ఒకరికి రూ.10 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ అభినందించారు.


