News February 27, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News April 13, 2026
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు.. UPDATE

AP: రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో <<19603357>>డీలిమిటేషన్<<>> ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం వార్డులు, డివిజన్లు 3,206 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం మరో 736 పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆ సంఖ్య 3,942కు చేరనుంది. ఈ ప్రక్రియ ముగియగానే ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని SEC భావిస్తోంది. ఇక మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు కోర్టు కేసులు తేలాక ఎలక్షన్స్ నిర్వహించనుంది.
News April 13, 2026
ALERT: ఈ చిన్న తప్పుతో గుండెపోటు రావొచ్చు

నిద్ర విషయంలో సమయపాలన లేకపోతే గుండెపోటు ముప్పు రెట్టింపు అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కేవలం ఎన్ని గంటలు నిద్రపోయామనేది కాకుండా, రోజూ ఒకే సమయానికి పడుకోవడం చాలా ముఖ్యం. ‘నిద్రపోయే సమయంలో 1-2గంటలు తేడా వచ్చినా జీవ గడియారం దెబ్బతింటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రాత్రి ఒకే టైమ్‌కు నిద్రపోవడం అలవాటు చేసుకోండి’ అని సూచిస్తున్నారు.
News April 13, 2026
స్మార్ట్ గవర్నెన్స్.. సింగపూర్‌కు 9 మంది మంత్రులు

AP: ప్రజలకు స్మార్ట్ గవర్నెన్స్‌ను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 9 మంది మంత్రులు, ఉన్నతాధికారులకు ట్రైనింగ్ ఇప్పించనుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నారాయణ, అచ్చెన్న, నాదెండ్ల, సత్యకుమార్, అనగాని, నిమ్మల, పయ్యావుల, అనిత, జనార్దన్ సింగపూర్‌లో పర్యటించనున్నారు. రోజుకొక అంశంపై వారం రోజులపాటు శిక్షణ ఉంటుంది. వారు తిరిగొచ్చాక ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు.


