News February 14, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News March 12, 2026
HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

HHF-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ఆనందిమా కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ AI కిట్‌తో BP, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడునూ నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు. గర్భిణుల పాలిట AI వరంగా నలిచింది.
News March 12, 2026
16న ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

AP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర స్థాయి, అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. జిల్లాల స్థాయిలో వచ్చే 5 రోజుల్లో కలెక్టర్లు తమకు అనువైన రోజున ఇఫ్తార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.
News March 12, 2026
వరి పంట విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

వరి పంట ప్రస్తుతం నాటిన సమయాన్ని బట్టి ఈనిక, గింజ పాలుపోసుకునే దశ, పూత దశలో ఉంది. ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ పంట పూత దశలో ఉన్నట్లైతే నీటి ఎద్దడికి గురికాకుండా 2 అంగుళాల మేర నీరు ఉండేలా చూడాలి. పంట పిలక దశలో ఉంటే రెండో దఫాగా 45 kgల యూరియా వేయాలి. చిరుపొట్ట దశలో ఉన్న పొలాల్లో చివరి దఫా యూరియా 45KGలు+ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20kgలు వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


