News February 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News March 15, 2026
LSGకి బిగ్ షాక్?

ఈ నెలాఖరున ప్రారంభమయ్యే IPLలో LSG జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంతో ఈ సీజన్ ఆడటం అనుమానమే అని అంటున్నాయి. తొడ కండరాల గాయం వల్ల T20WCలోనూ అతను ఆడలేదు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈసారి వేలంలో ఇతడిని LSG రూ.2కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్లో హసరంగా RR తరఫున ఆడి 11 వికెట్లు తీశారు.
News March 15, 2026
పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం

AP: TDP MP పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఘటనపై వివరణ కోరుతూ మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని, పూర్తి నివేదిక తనకు సమర్పించాలని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సూచించారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని CBN స్పష్టం చేశారు. నేతల బలహీనతలు, తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని తేల్చిచెప్పారు.
News March 15, 2026
పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500.. త్వరలో కీలక ప్రకటన!

TG: ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో పెండింగ్‌లో ఉన్నవాటి అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్ రూ.4,000కు పెంపు హామీలపై రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇక కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైనా కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.


