News November 24, 2024

పుట్లూరులో మరో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిన్న గార్లదిన్నె వద్ద జరిగిన ఘోర ఘటనను మరువక ముందే పుట్లూరు మండలంలోని నారాయణరెడ్డిపల్లి వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లి వద్ద బైకు ఎద్దుల బండిని ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరొకరికి త్రీవ గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Similar News

News December 4, 2024

అనంతపురం జిల్లాలో భూప్రకంపనల ప్రభావం లేదు!

image

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూ ప్రకంపనల ప్రభావం అనంతపురం జిల్లాపై లేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, 2017లో బెళుగుప్ప మండలం జీడిపల్లి, 2019లో ఉరవకొండ మండలం అమిద్యాలలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిన విషయం తెలిసిందే.

News December 4, 2024

అనంతపురం జిల్లాలో మిద్దె కూలి ముగ్గురి మృతి

image

అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. రెండ్రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి కందుర్పిలో మిద్దె కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. మృతులు గంగన్న, సంధ్య, శ్రీదేవిగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి నాని కూలినట్లు తెలుస్తోంది.

News December 4, 2024

అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజులు వర్షం

image

అనంతపురం జిల్లాలో బుధవారం నుంచి ఆదివారం వరకు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలిలో తేమ శాతం ఉదయం 83.9% నుంచి 95.1% వరకు ఉండొచ్చని చెప్పారు. అలాగే మధ్యాహ్నం 59.9% నుంచి 68.1% వరకు ఉండొచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.