News June 4, 2024
పుత్తా చైతన్య రెడ్డి విజయం

కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం సాధించారు. ఈయనకు 93898 ఓట్లు పోలవ్వగా.. ఆయన ప్రత్యర్థి పి.రవీంద్రనాథ్ రెడ్డికి 69244 ఓట్లు వచ్చాయి. దీంతో పుత్తా 24654 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఆయన మెదటి సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
NOTE: పోస్టల్ బ్యాలెట్ కలపకుండా
Similar News
News November 27, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నిన్నటి కన్నా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,550
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.11,546
☛ వెండి 10 గ్రాములు: రూ.1662.00
News November 27, 2025
కడప జిల్లాలో రూ.22.75 కోట్లు మాయం?

కడప జిల్లాలో పేజ్-3 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు కనిపించడం లేదు. అప్పట్లో ప్రతి ఇంటికి పునాదుల కోసం రూ.35 వేలు వసూలు చేశారు. నిర్మాణాలు మొదలవ్వని 6,501 ఇళ్లకు సంబంధించి సుమారు రూ.22.75 కోట్లు స్వాహాపై ఇటీవల పరిశీలన చేపట్టారు. జిల్లాలో 16,765 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 10,264 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 6,501 ఇళ్లు ప్రారంభం కాలేదు. దీనిపై విచారణ చేపట్టారు.
News November 27, 2025
MP సీఎం రమేశ్ తల్లికి ప్రముఖుల నివాళి

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ పార్థివ దేహం వద్ద ప్రముఖులు నివాళి అర్పించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణమరాజు, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెవీపీ రామచంద్రారావు, ఇతర నాయకులు రత్నమ్మ పార్థివ దేహం వద్ద నివాళులర్పించి సీఎం రమేశ్‌ను పరామర్శించారు.


