News March 9, 2025
పుత్తూరు: చినరాజుకుప్పంలో హత్య

పుత్తూరు పట్టణ పరిధిలోని చినరాజుకుప్పం గ్రామానికి చెందిన మణికంఠ (29) అనే యువకుడు ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 2, 2025
HYD: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఖాజాగూడా చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో 8 భారీ టవర్స్ అక్రమంగా నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్, మురళి నాయక్, రాకేష్ రెడ్డి పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, బిల్డర్లకు నోటీసులిచ్చింది.
News December 2, 2025
కాకినాడ: ‘చంపేసి పారిపోయాడు.. ఇతను కనిపిస్తే చెప్పండి’

కాకినాడ రూరల్ ఇంద్రపాలేనికి చెందిన బేతా గంగరాజు (52) తన భార్యను గత నెల 30న హత్య చేసి పరారయ్యాడని ఇంద్రపాలెం ఎస్ ఐ వీరబాబు తెలిపారు. అతని ఆచూకీ తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎస్ఐ ఫోన్ 9440796521, సీఐ 9440796555 కు సమాచారం ఇవ్వాలన్నారు.
News December 2, 2025
ADB: అసలు మీరు ఏ వర్గం రా బాబూ..!

పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలోకి ఫిరాయింపులు, చేరికలు జోరందుకున్నాయి. పలువురు నాయకులు ఓవైపు అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నాయకులతో అంట కాగుతున్నారు. ఉదయం ఒక పార్టీ కండువా వేసుకుని.. సాయంత్రం మరో పార్టీలో చేరుతున్న ఘటనలు చేసుకుంటున్నాయి. ఇది చూసిన పలువురు మీరు ఏ వర్గం రా బాబు అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే జరుగుతోందా కామెంట్ చేయండి.


