News March 10, 2025
పుత్తూరు: చినరాజుకుప్పంలో హత్య

నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణ పరిధిలోని చినరాజుకుప్పం గ్రామానికి చెందిన మణికంఠ (29) అనే యువకుడు ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 10, 2025
చిత్తూరు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 41 ఫిర్యాదులు

చిత్తూరు నగరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 41 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
News March 10, 2025
అర్జీలను స్వీకరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్

చిత్తూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీలు సమర్పించి, జిల్లా అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News March 10, 2025
శ్రీకాళహస్తిలో ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక?

హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక శ్రీకాళహస్తిలో జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్తో పాటు స్టార్ నటులందరినీ ఈ వేడుకకు తీసుకొచ్చేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నారట. ఈ చిత్రంలో కన్నప్పగా మంచు విష్ణు నటిస్తుండగా.. నందీశ్వరుడిగా ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే.