News November 6, 2024
పుత్తూరు: సివిల్ సప్లై డీటీ విష్ణు అరెస్ట్

రేషన్ బియ్యం అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్న సివిల్ సప్లై గోడౌన్ CSDT విష్ణును పుత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పుత్తూరు కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. CI సురేంద్ర నాయుడు మాట్లాడుతూ.. 2022 DEC నుంచి 2024 AUG వరకు పుత్తూరు స్టాక్ గోడౌన్ CSDTగా వ్యవహరిస్తూ 5040 బస్తాలు అమ్మి రూ.29.70 లక్షల సొమ్ము చేసుకొని రూ.17 లక్షలు అప్పులు చెల్లించినట్లు తెలిపారు.
Similar News
News December 2, 2025
చిత్తూరు: 70 బస్సులకు నోటీసులు

కాలేజీ, స్కూల్ బస్సుల యాజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చిత్తూరు DTC నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వారం రోజులుగా జిల్లాలో తనిఖీలు చేశామన్నారు. జిల్లాలో సుమారు 900 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయన్నారు. ఇటీవల 200పైగా బస్సులను తనిఖీ చేశామని.. నిబంధనలు పాటించని 70 బస్సులకు నోటీసులు అందించామని వెల్లడించారు.
News December 2, 2025
ఐరాల: మహిళపై చిరుత పులి పిల్లల దాడి

ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో మహిళపై చిరుత పులి పిల్లలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు మేరకు.. ఓ మహిళ ఆదివారం సాయంత్రం తన ఆవులను మేతకు తీసుకెళ్లింది. చిరుత పులి పిల్లలు ఆమెపై దాడి చేశాయి. గోళ్లతో గాయం చేశాయి. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నెలలోనే 5ప్రదేశాల్లో చిరుత పులి దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు.
News December 2, 2025
బేస్ బాల్ అండర్-14 విజేతగా చిత్తూరు

పలమనేరులో SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విన్నర్స్గా, కడప జట్టు రన్నర్స్గా నిలిచింది. బాలుర విభాగానికి చెందిన ఫైనల్ పోటీల్లో చిత్తూరు, కడప జట్ల మధ్య హోరాహోరీ పోరులో చిత్తూరు బాలురు జట్టు గెలుపొందింది. అదేవిధంగా బాలికల విభాగంలోనూ చిత్తూరు, కడప జట్లు తలపడగా.. కడప జట్టు గెలుపొందినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.


