News November 6, 2024

పుత్తూరు: సివిల్ సప్లై డీటీ విష్ణు అరెస్ట్

image

రేషన్ బియ్యం అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్న సివిల్ సప్లై గోడౌన్ CSDT విష్ణును పుత్తూరు పోలీసులు అరెస్టు చేశారు‌. మంగళవారం పుత్తూరు కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. CI సురేంద్ర నాయుడు మాట్లాడుతూ.. 2022 DEC నుంచి 2024 AUG వరకు పుత్తూరు స్టాక్ గోడౌన్ CSDTగా వ్యవహరిస్తూ 5040 బస్తాలు అమ్మి రూ.29.70 లక్షల సొమ్ము చేసుకొని రూ.17 లక్షలు అప్పులు చెల్లించినట్లు తెలిపారు.

Similar News

News December 4, 2024

చిత్తూరులో విషాదం.. 12 ఏళ్ల బాలిక మృతి

image

బంగారుపాలెంలోని ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. శేషాపురానికి చెందిన గుణశ్రీ జ్వరంతో బాధపడుతుండగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంజక్షన్ వేశారు. కొంతసేపటికే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 4, 2024

తిరుపతిలో 5న జాబ్ మేళా

image

పద్మావతి పురం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నట్లు వివరించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News December 2, 2024

చిత్తూరు: 120 స్మార్ట్ అలారం లాక్ పంపిణీ

image

టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ నెట్టికంటయ్య నగరంలోని పలు ప్రార్ధనా మందిరాలకు 120 స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నియంత్రణకు టూ టౌన్ పరిధిలోని అన్ని చర్చిలు, దేవాలయాలు, మసీదులకు స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేస్తున్నామన్నారు. దుకాణా దారులు, ఇంటి యజమానులు సైతం ఈ లాక్ లను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.