News May 25, 2024

పుదుచ్చేరి సీఎంతో తూర్పు నౌకదళాధిపతి భేటీ

image

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నటేషన్ రంగస్వామిని తూర్పు నౌకదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ శనివారం కలిశారు. ఈ సమావేశంలో భారత నౌకాదళం సముద్ర కార్యకలాపాలు సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు , తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాల్లో అవుట్ రీచ్ కార్యకలాపాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 3, 2025

విశాఖ జిల్లాకు 7 రాష్ట్రస్థాయి అవార్డులు

image

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద విశాఖ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 7 అవార్డులు లభించాయని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. GVMCకి-స్వచ్ఛ సర్వేక్షన్, సింహగిరి కాలనీకి-స్వచ్ఛ SLFS, గోరపల్లికి-స్వచ్ఛ గ్రామ, నడుపూరు ZPHS పాఠశాలకు-స్వచ్ఛ పాఠశాల, MVP రైతు బజార్‌కు-స్వచ్ఛ రైతు బజార్, లోటస్ వైర్‌లెస్ టెక్నాలజీకి-స్వచ్ఛ MSME, తిరుమల నగర్ రెసిడెన్షియల్ కాలనీకి-స్వచ్ఛ కాలనీ అవార్డులు లభించాయి.

News October 2, 2025

విశాఖలో భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ నంబర్‌లు

image

విశాఖపట్నంలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజల సహాయార్థం కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం ఈ క్రింది నంబర్లకు సంప్రదించవచ్చు. విశాఖ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్: 0891-2590100, 0891-2590102, విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO): 8500834958, భీమిలి రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO): 8074425598 నంబర్ అందుబాటులో తీసుకువచ్చారు.

News October 2, 2025

జైలు ఒక శిక్షణాలయం వంటిది: కలెక్టర్

image

విశాఖ సెంట్రల్ జైలులో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజు, కలెక్టర్ హరిందర్ ప్రసాద్, జిల్లా న్యాయ సేవల సంస్థ సెక్రటరీ సన్యాసినాయుడు హాజరై ఖైదీలతో ముచ్చటించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జైలు అనేది శిక్షణాలయం వంటిదని, ప్రతి ఒక్కరూ సోదరభావంతో నడుచుకుంటూ శాంతి, అహింసా మార్గాలలో ప్రవర్తించాలని సూచించారు.