News April 9, 2025
పురమిత్ర యాప్ ద్వారా సేవలు పొందండి: మౌర్య

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ‘పురమిత్ర’ యాప్ ద్వారా ప్రజలు మునిసిపల్ సేవలు పొందవచ్చని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మంగళవారం తెలిపారు. ప్రజలు కార్యాలయాలు చుట్టూ తిరిగే పనిలేకుండా మున్సిపల్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్‌ను రూపొందించిందన్నారు.
Similar News
News July 6, 2025
మహానందిలో క్షుద్ర పూజల కలకలం

మహానంది పుణ్యక్షేత్రం ఆవరణలోని గరుడ నంది పక్కన తాటి చెట్ల దగ్గర రెండు రోజుల క్రితం క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో స్త్రీ బట్టలు, క్షుద్ర పూజా సామగ్రి ఉండటం చూసిన గ్రామస్థులు భయాందోళ చెందుతున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News July 6, 2025
అనంత: ‘బెంగళూరు వెళ్తున్నానని చెప్పి లవర్‌ను పెళ్లి చేసుకుంది’

ప్రత్యేక కోర్సు కోసం బెంగళూరు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అనంతపురం శ్రీనివాసనగర్‌కు చెందిన యువతి, ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు షాకిచ్చింది. బీటెక్ పూర్తిచేసిన ఆమె జూన్ 20న ఇంటి నుంచి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. త్రీ టౌన్ PSలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆమె ఆచూకీ లభించగా, ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది.
News July 6, 2025
కరీంనగర్: ఈ నెల 13లోగా అప్లై చేయాలి

జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 13లోగా http://nationalawardstoteachers.education.gov.in వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.