News May 21, 2024

పురాతన కట్టడాల ప్రాముఖ్యతను వెలుగులోనికి తీసుకురావాలి: అనంత కలెక్టర్

image

జిల్లాలోని పురాతన కట్టడాల ప్రాముఖ్యతను వెలుగులోనికి తీసుకురావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనల శాలల శాఖ, ఇంటాక్ సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాల్గొన్నారు.

Similar News

News December 14, 2024

అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు, దాడులు,ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలను ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం వెల్లడించారు. పేకాట, మట్కా, తదితర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎం.వి కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై మోటారు వాహనాల చట్ట ప్రకారంగా 707 కేసులు నమోదు చేశారు. రూ. 1,72,816/- లు ఫైన్స్ వేశారు.

News December 13, 2024

అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు: MLA కాల్వ

image

అనంతపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ రాయదుర్గం MLA కాల్వ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు అని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు రైతాంగానికి, సాగునీటి రంగానికి ఏమీ చేయకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.

News December 13, 2024

పెనుకొండ బాబయ్య స్వామి చరిత్ర.. (1/1)

image

పెనుకొండ బాబయ్య స్వామి 752వ గంధం, ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా బాబా ఫకృద్దీన్‌ జన్మస్థలం ఇరాన్‌ దేశం. చక్రవర్తిగా రాజ్యపాలన చేస్తున్న సమయంలో చేసిన తప్పునకు పశ్చాత్తాపంతో గురువుల ఆదేశానుసారం ఇరాన్‌ను వీడుతారు. దేశాలన్నీ తిరుగుతూ తమిళనాడులోని తిరుచనాపల్లికి చేరతారు. అక్కడ సత్తేహార్‌ తబ్రే ఆలం బాద్‌షాను గురువుగా పొందుతారు. ఆయన వేపపుల్ల ఇచ్చి పెనుకొండకు వెళ్లమని బాబాను ఆదేశిస్తారట. <<14864905>>Cont’d..<<>>