News November 29, 2024

పురిటి నొప్పులతో మహిళ.. ఆదోనిలో బైక్‌పై ప్రసవం

image

నిండు గర్భిణి బైక్‌పైనే ప్రసవించిన ఘటన ఆదోనిలో జరిగింది. క్రాంతినగర్‌కు చెందిన మహిళ లలితకు నిన్న పురిటి నొప్పులు రాగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. సమయానికి ఆటోలు లేకపోవడంతో బైక్‌పైనే ఆమెను ఎక్కించుకుని బయలుదేరారు. కొంత దూరం వెళ్లగానే నొప్పులు ఎక్కువై బిడ్డ తల బయటకి వచ్చింది. వెంటనే సమీపంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నార్మల్ డెలివరీ చేయగా కవలలు జన్మించారు.

Similar News

News October 24, 2025

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును జిల్లా పోలీసు అధికారులు మంత్రులకు వివరించారు. మంత్రులతో పాటు డీజీపీ హరీశ్, డీఐజీ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌లు ఉన్నారు.

News October 24, 2025

కర్నూలు: ALL THE BEST సాదియా

image

పంచలింగాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 26 వరకు జరగబోయే 69వ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాఠశాల చెందిన సాదియా తబస్సుమ్ 48 కేజీల వెయిట్ కేటగిరిలో పాల్గొంటున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు మాలిక్ తెలిపారు.

News October 24, 2025

తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ రూపొందించండి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, హెచ్ఎన్ఎస్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.