News November 29, 2024
పురిటి నొప్పులతో మహిళ.. ఆదోనిలో బైక్‌పై ప్రసవం
నిండు గర్భిణి బైక్‌పైనే ప్రసవించిన ఘటన ఆదోనిలో జరిగింది. క్రాంతినగర్‌కు చెందిన మహిళ లలితకు నిన్న పురిటి నొప్పులు రాగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. సమయానికి ఆటోలు లేకపోవడంతో బైక్‌పైనే ఆమెను ఎక్కించుకుని బయలుదేరారు. కొంత దూరం వెళ్లగానే నొప్పులు ఎక్కువై బిడ్డ తల బయటకి వచ్చింది. వెంటనే సమీపంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నార్మల్ డెలివరీ చేయగా కవలలు జన్మించారు.
Similar News
News December 10, 2024
Rain Alert: కర్నూలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 08518 277305కు ఫోన్ చేయాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
News December 10, 2024
11, 12 తేదీల్లో రాయలసీమలో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 11, 12 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పంట కోతలు పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని తెలిపింది.
News December 10, 2024
ప్రేమోన్మాదిని పోలీసులే కాల్చి చంపాలి: బాలిక తల్లి
నందికొట్కూరులో ప్రేమోన్మాది బాలికకు <<14828920>>నిప్పు<<>> పెట్టిన ఘటనపై తల్లి కన్నీరుమున్నీరయ్యారు. తనకున్న ఒక్క కూతురినీ అన్యాయంగా చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూతురు లహరిని ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నా. అన్యాయంగా చంపేశాడు. వాడిని పోలీసులే కాల్చి చంపేయాలి. లేకుంటే నాకు అప్పగించండి.. సార్. ఇలాంటి ఉన్మాదులకు సమాజంలో బతికే హక్కులేదు’ అంటూ విలపించారు.