News February 28, 2025
పురుషులు 973, మహిళలు 886 మంది ఓటు వేశారు..!

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ చేపట్టగా 2022 మంది ఓటర్లకు గాను 1859 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 973, మహిళా ఓటర్లు 886 మంది ఓటు వేశారని వెల్లడించారు. 91.94% నమోదయిందని, భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను నల్గొండ రిసెప్షన్ సెంటర్కు తరలించామన్నారు.
Similar News
News November 22, 2025
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం

సింగరేణి సీఎండీ బలరామ్ ప్రారంభించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు, పరిష్కారానికి త్వరలో వాట్సాప్ నెంబరును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికి, ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని సీఎండీ వెల్లడించారు.
News November 22, 2025
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆప్ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 48 మంది నుంచి 66 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. శనివారం 12 మంది అభ్యర్ధులు 14 సెట్ల నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 22, 2025
వెయిట్ లిఫ్టర్లను అభినందించిన కలెక్టర్

ఈ నెల 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, సీనియర్ ఉమెన్, మెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు లిఫ్టర్లు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వీరేశ్, ముషరాఫ్, పర్వేజ్, చాంద్ బాషా, హజరత్ వలిని కలెక్టర్ డా.సిరి శనివారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి వెయిట్ పోటీల్లోనూ ఇదే ప్రతిభ కనబరచాలన్నారు. కోచ్ యూసుఫ్ పాల్గొన్నారు.


