News April 15, 2025
పురేస్ట్ ఆఫ్ ది పూర్ కుటుంబాలను ఎంపిక చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పురేస్ట్ ఆఫ్ ది పూర్ కుటుంబాలను ఎంపిక చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకం, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని, అట్టి జాబితా ప్రకారం విచారణకు గెజిటెడ్ అధికారులను విచారణ అధికారులుగా నియమించనున్నట్లు చెప్పారు.
Similar News
News September 14, 2025
ఉలవపాడు: కరేడులో టెన్షన్..టెన్షన్

ఉలవపాడు(M) కరేడులో ఆదివారం అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆంక్షల నడుమ బోడె రామచంద్ర యాదవ్ మీటింగ్ జరగాల్సి ఉండటంతో పరిణామాలు ఎలా దారి తీస్తాయో అన్న టెన్షన్ అందరిలో ఏర్పడింది. జులై 29న జరిగిన హైవే దిగ్బంధం కార్యక్రమంలో కూడా బోడె రామచంద్ర వెంట అనూహ్యంగా వేలాది మంది కరేడు ప్రజలు దూసుకొచ్చిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.
News September 14, 2025
తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు!

AP: గుంటూరు రూరల్(M) తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై ల్యాబ్‌లో చేసిన నీటి పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. వీటితో పాటు స్ట్రాన్షియం అనే ఎలిమెంట్, ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నీటిని తాగడం వల్లే స్థానికులు అనారోగ్యం బారిన పడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇటీవల తురకపాలెంలో అనారోగ్యంతో పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే.
News September 14, 2025
సంగీత దర్శకుడు శ్రీ మన గుంటూరు జిల్లా వారే

సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో 1966, సెప్టెంబర్ 13న జన్మించారు. ఈయన సంగీత దర్శకుడు కె. చక్రవర్తి 2వ కుమారుడు. 1993లో గాయం సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో సిరివెన్నెల రాసిన
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే గీతం ఒక ఆణిముత్యం. సింధూరం చిత్రం ఆయన కెరీర్లో మరో పెద్ద విజయం.