News February 10, 2025

పులిగుండాల అందాలు చూడతరమా..!

image

ఖమ్మం జిల్లా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతంలోని పులిగుండాలను ఎకో టూరిజం హబ్‌గా మార్చేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రెక్కింగ్, చెరువులో బోటింగ్, రాత్రిళ్లు నక్షత్రాల వ్యూ, క్యాంపులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పర్యాటక పనులు పూర్తి చేస్తే జిల్లా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు.

Similar News

News November 21, 2025

హైదరాబాద్ కలెక్టరేట్లో పానీ పరేషాన్

image

హైదరాబాద్ కలెక్టరేట్లో నీటి సమస్య నెలకొంది. నిత్యావసర పనులకూ నీరు లేక సిబ్బంది విలవిల్లాడుతున్నారు. పది రోజులుగా ఈ సమస్య నెలకొంది. పైప్‌లైన్ సమస్య కారణంగా నీటి ఇబ్బంది నెలకొంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక మంది సమస్యలతో కలెక్టరేట్‌కు వస్తుంటారు. ఇందులో నీటి సమస్య ఉండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News November 21, 2025

రైతుల ఆత్మహత్యాయత్నం.. మీ హామీ ఏమైంది రేవంత్: హరీశ్ రావు

image

TG: భూములు రిజిస్ట్రేషన్ కావడం లేదని MLA క్యాంపు/తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైంది రేవంత్? మీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. భూములపై రైతులకు హక్కు లేకుండా చేస్తోంది. 70వేల పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.

News November 21, 2025

తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!

image

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో స్కూళ్లలో ఓపెన్ గ్రౌండ్ క్రీడలను నిషేధించే దిశగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాధారణంగా వింటర్ సీజన్‌లో ఢిల్లీలోని స్కూల్స్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తుంటాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గేమ్స్ రద్దు అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. కాగా ఇండోర్ గేమ్స్ నిర్వహణకూ సౌకర్యాలు కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు.