News February 10, 2025
పులిగుండాల అందాలు చూడతరమా..!

ఖమ్మం జిల్లా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతంలోని పులిగుండాలను ఎకో టూరిజం హబ్‌గా మార్చేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రెక్కింగ్, చెరువులో బోటింగ్, రాత్రిళ్లు నక్షత్రాల వ్యూ, క్యాంపులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పర్యాటక పనులు పూర్తి చేస్తే జిల్లా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు.
Similar News
News March 6, 2026
తిరుపతి: 283 మంది గైర్హాజరు

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 96 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 9,880 మంది విద్యార్థులకు గాను 9,597 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 283 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు.
News March 6, 2026
మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన కామారెడ్డి కలెక్టర్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభ కార్యక్రమంలో శుక్రవారం నిజామాబాద్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క ప్రారంభించేందుకు వచ్చాకగ. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పూల బొకేలు అందజేసి మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
News March 6, 2026
అభిషేక్ మాదిరే వరుణ్‌ను ఎందుకు సపోర్ట్ చేయరు: సెహ్వాగ్

నిన్న ENGతో మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 64 పరుగులు ఇవ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటిపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు. ‘ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా సరిగ్గా ఆడట్లేదు. అతడిని వెనకేసుకొస్తున్న వారికి బౌలర్‌కు సపోర్ట్ చేయడానికి ఎందుకు సమస్య? 3 మ్యాచ్‌లలో రన్స్ ఇవ్వగానే వేరే బౌలర్ కోసం చూస్తున్నామని చెబుతారు. ఆ కొత్త ప్లేయర్ రాణిస్తాడనే గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నించారు.


