News September 6, 2024
పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేయటంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ అధికారులు 8గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1.68 లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1.91 క్యూసెక్కులుగా ఉంది.
Similar News
News January 3, 2026
GNT: మారిషస్ అధ్యక్షుడికి స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్‌కి గుంటూరులో ఘన స్వాగతం లభించింది. సతీ సమేతంగా విచ్చేసిన ఆయనను గుంటూరు వెల్కమ్ హోటల్ వద్ద కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా స్వాగతం పలికారు. 4వ తేదీ ఉదయం 10.30 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొంటారు.
News January 3, 2026
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి: DEO

తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై మరింత నమ్మకాన్ని పెంచేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని DEO సలీమ్ బాషా సూచించారు. బ్రాడీపేటలోని శారదానికేతన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం DEO ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుస్తకాల పఠనం, ఉత్తమ మార్కుల్లో విద్యార్థులు ఆకాశమే హద్దుగా నిలిచేలా తీర్చిదిద్దాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని అన్నారు.
News January 3, 2026
GNT: సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సీఎం చంద్రబాబు ఈ నెల 5న గుంటూరు రానున్న నేపథ్యంలో SP వకుల్ జిందాల్‌తో కలిసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు సీఎం విచ్చేయనున్నారు. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


