News April 13, 2025
పులిచెర్ల: బావిలో దిగి బాలుడి మృతి

బంతి కోసం బావిలోకి దిగి పైకి రాలేక దిలీప్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పులిచెర్ల మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. సురేష్, లత కుమారుడైన దిలీప్ బెంగళూరులో ఉంటున్నారు. ఉగాది పండుగకు అయ్యావారిపల్లికి వచ్చారు. శనివారం సాయంత్రం అవ్వతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. బంతి ఆడుకుంటున్న సమయంలో బంతి బావిలో పడింది. బంతి కోసం దిగిన దిలీప్ పైకి రాలేక మృతి చెందాడు. కల్లూరు ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించారు.
Similar News
News February 27, 2026
CTR: రూ.కోట్లు కొల్లగొట్టి.. ప్రజలకు కుచ్చుటోపి పెట్టి!

చీటీల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. మొన్న పలమనేరులో ఓ ఘటన వెలుగు చూడగా, నేడు పూతలపట్టులో అనధికార చీటీ నిర్వాహకుడు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2-3 కోట్ల మేర చీటీ డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో సహా అందుబాటులో ఉండకపోవడం, చీటీ కార్యాలయాన్ని మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 27, 2026
చిత్తూరు: ‘తక్షణమే రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వాలి’

కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం మైక్రో ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించారు. అర్హత కలిగిన రైతులందరికీ తక్షణమే సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వాటా చెల్లించిన వారికి వెంటనే మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని ఆయన సూచించారు. డ్రిప్ పరికరాలు మంజూరైన 1386 మందికి మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. మెటీరియల్ అందుకున్న రైతులకు ఇన్స్టాలేషన్ చేయాలన్నారు.
News February 27, 2026
74% మ్యాపింగ్ పూర్తి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో 74% ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి అయినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆరు నెలల్లో ఓట్ల జాబితాలో తొలగించిన వివరాలను రాజకీయ పార్టీలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.


